తర్తూరు’లో ప్రజలకు తగ్గట్టుగానే ఏర్పాట్లు
1 min read

-బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి సమస్య రాకూడదు
-అధికారులతో ఎమ్మెల్యే జయసూర్య..
న్యూస్ నేడు నందికొట్కూరు: తర్తూరు బ్రహ్మోత్సవాల్లో ప్రజలకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అధికారులను ఆదేశించారు.నంద్యాల జిల్లాజూపాడుబంగ్లా మండలం తర్తూరులో శ్రీ లక్ష్మి రంగనాథ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు మరియు అధికారులతో బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వాటిపై ఎమ్మెల్యే సోమవారం సమీక్ష నిర్వహించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, కరెంట్ సరఫరా,పారిశుద్ధ్యం, తదితర వాటి గురించి ఎమ్మెల్యే అధికారులకు దిశానిర్దేశం చేశారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా పోలీస్ సిబ్బంది అధికంగా నియమిస్తామన్నారు. ముందుగా ఆలయ ఈవో సాయికుమార్,దేవాలయ చైర్మన్ నారాయణరెడ్డి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం రథోత్సవ కార్యక్రమం ఉంటుంది.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి,కడియం వెంకటేశ్వర్లు, ఎంపీపీ నీలమ్మ,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జ్ గిరిశ్వర్ రెడ్డి,రమణారెడ్డి,రామ్మోహన్ రెడ్డి,డీసీసీ చైర్మన్ పరమేశ్వర రెడ్డి,అధికారులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

