NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గజ్జెహల్లిలో బడి బయటి పిల్లలపై ప్రత్యేక దృష్టి

1 min read

హోళగుందన్యూస్ నేడు: ఎం.వి.  ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి పిల్లలందరూ బడిలలోనే ఉండాలనిమండల సీఆర్​పిఎఫ్​  కన్వినర్ కెంచప్ప అధ్వర్యంలో ఈ రోజు గజ్జెహల్లి గ్రామంలో “బడి బయట పిల్లలు అందరూ బడిలోనే ఉండాలి” అనే నినాదంతో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బడికి రాని డ్రాపౌట్ అయిన పిల్లలు చాలా రోజులు నుండి బడికి వెళ్లని పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ పిల్లలందరూ బడిలోనే ఉండాలని ఎం.వి.   ఫౌండేషన్ ఆధ్వర్యంలో  గ్రూప్ మోటివేషన్  కార్యక్రమం నిర్వహించారుతల్లిదండ్రులందరూ పూర్తి మద్దతు తెలియజేయడం విశేషం.పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిరంతరం పనిచేస్తున్న ఏకైక సంస్థ ఎం.వి.  ఫౌండేషన్ (ఎన్​జీఓ) అని గ్రామ ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలోమండల కో-ఆర్డినేటర్ సేవ్యా నాయక్,గ్రామ సచివాలయ మహిళా పోలీస్ కవిత,  ఎంపిపి స్కూల్ టీచర్ నీల్లేష్ విలేజ్ ఆర్గనైజర్ విజయ్,ముల్లా సాబ్, శేఖన్నా, భారతి,యూత్ సభ్యులు రమేష్, గణేష్, రాజు, అశోక్, గంగాధర్, తిరుమల తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author