నారాయణ పాఠశాలలో అట్టహాసంగా మాస్టర్ ఓరియంటేషన్ కాంటెస్టు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక కర్నూలు నగరంలోని ఎలుకూరు బంగ్లా నందలి నారాయణ పాఠశాలలో బుధవారం నాడు కర్నూలు జిల్లా లోని నారాయణ పాఠశాలలకు చెందిన 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు విద్యను అభ్యసించే విద్యార్థులకు నిర్వహించిన మాస్టర్ ఓరియంటేషన్ కాంటెస్టును ఘనంగా నిర్వహించారు.కర్నూలు జిల్లా నారాయణ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం నియోజక వర్గ ఎమ్మెల్యే శ్రమతి గౌరు చరితా రెడ్డి వచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని లాంఛన ప్రాయంగా ప్రారంభించారు.అనతరం పాఠశాల చిన్నారులను ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాణ్యం నియోజక వర్గ ఎమ్మల్యే శ్రీమతి గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులలో చిన్నతనం నుండి సృజనకు పదును పెట్టే విధంగా, పిల్లల కెరీర్ ను అభివృద్ధి చేసే ఇలాంటి కార్యక్రమాలను పాఠశాల యాజమాన్యం వారు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు భవిష్యత్తును ఉన్న తంగా మలచుకొని ఉత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారు సూచించారు. కర్నూలు నగరంలోని యస్. టి.బి. సి. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డా. సునీతా రోస్ మరియు ఉస్మానియా డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి రేష్మ తన్వర్ ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి విచ్చేసి, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.విద్యార్థుల నృత్య గీతాలాపనలు, ఉపన్యాసాలు, ప్రదర్శనలు ఆద్యంతం ఆహూతులను అలరించాయి. ఆద్యంతం అలరించిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపాల్ అన్వర్ బాషా , శ్రీనివాస రెడ్డి , రామాంజనేయులు , ఆర్ అండ్ ది విభాగాధిపతి శ్రీమతి భారతి , పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, బోధన మరియు బోధనేతర నిబ్బంది పాల్గొన్నారు.


