రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్మన్ ని కలిసిన బహుజన టైమ్స్ మేనేజింగ్ డైరెక్టర్
1 min read

హోళగుంద న్యూస్ నేడు: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్మన్ కే.ఎస్ జవహర్ ని కలిసిన బహుజన టైమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్, కురవల్లి ఉదయ్ కుమార్.ఈ మధ్య కాలంలో కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి దళితులపై వరుస దాడులు,హత్యలు గురించి వివరించి మెమోరాండం సమర్పించడమైయినది. దళిత నాయకులనే హత్యల రూపంలో కబళిస్తుంటే సాటి సామాన్యమైన దళితలు పరిస్థితేంటి నాడు చిప్పగిరి లక్ష్మి నారాయణ, నేడు టీఎం రమేష్, రేపు మరి ఎవరు? అనే బయఆందోళనలో ఉన్నారు అని తెలియచేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా దళితుల అధిక సంఖ్యలో ఉన్న జిల్లా ఉంది అంటే అది కర్నూల్ జిల్లానే అని గుర్తు చేసారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితి లో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి, మరియు జిల్లా ఎస్పీ బాధిత కుటుంబలాను పరామర్శించి,పర్యటించి సమాజంలో మార్పును నెలకొల్పాలన్నారు. బాధిత కుటుంబాలకు రావాల్సిన ఎక్స్ గ్రేస్ యా కింద కోటి రూపాయలు నగదు, మరియు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలిని కోరడమైనది. మరి అదేవిదంగా ఇటువంటి ఘటనలు పునర్హతం కాకుండా, నిందితులకు పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలినిఇందుకు స్పందించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్ జవహర్ ఈ వరుస ఘటనలు రాష్ట్ర ముఖ్య మంత్రి దృష్టికి తీసుకొని వెళ్తాన్నారు.

