పది’లో మంచి ఉత్తీర్ణత సాధించాలి : డీఈవో
1 min read

పాఠశాలల ఆకస్మిక తనిఖీ చేసిన డీఈఓ జనార్దన్ రెడ్డి..
మిడుతూరు, న్యూస్ నేడు: 10వ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉ 8:45 నుండి మ రెండు గంటల వరకు మిడుతూరు మండలంలోనితలముడిపి,అలగనూరు, చెరుకుచెర్ల జిల్లా పరిషత్ పాఠశాలలను తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థుల 100 రోజుల ప్రణాళిక అమలు మరియు రోజూ వారి ప్రత్యేక తరగతుల నిర్వహణపై పాఠశాల హెచ్ఎంలు మరియు ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా పాఠశాలల్లో సమీక్ష నిర్వహించారు.ప్రతి ఉపాధ్యాయుడు తనకు సంబంధించిన సబ్జెక్ట్ లో 100 ఉత్తీర్ణతకు కృషిచేయాలని మరియు సి,డి గ్రేడ్ లో ఉన్న విద్యార్థులను గమనించి ప్రతి టీచర్ ఇద్దరూ లేదా ముగ్గురు విద్యార్థులను దత్తత తీసుకోవాలని డిఈవో వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు ఫైజున్నిసా బేగం,మల్లికార్జున నాయక్ బేగం పాల్గొన్నారు.

