NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి బిజెపి, విహెచ్పి నిరసన

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ, బిజెపి, వీహెచ్ పిల ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణం నాలుగు స్తంభాల కూడలి లో రాస్తారోకో, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ, బంగ్లాదేశ్ లోని ఉగ్రవాదాన్నిఅంతం చేయాలని, ఉగ్రవాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం బిజెపి విహెచ్పి కార్యకర్తలు నాలుగు స్తంభాల కోడలి వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి ప్రకండ అధ్యక్షులు వీర రాజు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త  రామలింగయ్య, ధార్మిక సంఘాల కార్యకర్తలు గోవర్ధన్, నారాయణ, రవి, భాస్కర్, ఉల్తన్న, లాయర్ ఏవి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author