NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జర్నలిస్టుల భవిష్యత్తు భద్రత కోసం  ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

1 min read

జర్నలిస్టుల స్థలాల రక్షణ, మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్, ఎంపీకి ఏపీజేఎఫ్ నేతల విజ్ఞప్తి

కర్నూలు, న్యూస్​ నేడు: జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్​) నేతలు కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాను కలసి పలు డిమాండ్లను వినిపించారు. ఈ సందర్భంగా జగన్నాథగట్టు ప్రాంతంలో ఉన్న జర్నలిస్టుల సొసైటీ స్థలాలను అధికారికంగా జర్నలిస్టు సొసైటీ పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేసి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు కేటాయించిన ఈ స్థలాలు ప్రభుత్వ రికార్డులలో ప్రభుత్వ భూమిగా నమోదు అయ్యాయని, ఎటువంటి అవకతవకలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారికంగా జర్నలిస్టు సొసైటీ పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేసి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ నాయుడు మాట్లాడుతూ, మీడియా రంగంలో ఎన్నో ఏళ్లుగా కష్టాలు ఎదుర్కొంటూ ప్రజాసేవ అందిస్తున్న జర్నలిస్టుల భవిష్యత్తు భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. జగన్నాథగట్టు సొసైటీ స్థలాలకు రోడ్లు, విద్యుత్ దీపాలు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు లేకపోవడంతో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని వారు వివరించారు. అలాగే కలెక్టర్ పి. రంజిత్ బాషా వినతిపత్రాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించారు. జగన్నాథగట్టు జర్నలిస్టు సొసైటీ స్థలాల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, సంబంధిత విషయాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శి తో పాటు ఏపీజేఎఫ్ రాష్ట్ర నేతలు హరినాథ్ రెడ్డి, మధు సుధాకర్, స్యామ్యూల్, జిల్లా నాయకులు ఊరుకుందు, రాఘవేంద్ర, సుధాకర్, మురళి మరియు ఇతరులు కలసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును కలసి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల స్థలాల రక్షణ, కాలనీ అభివృద్ధి వంటి అంశాలు వెంటనే పరిష్కరించబడితే మీడియా వర్గాలు మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో నిమగ్నం అవుతాయని స్పష్టం చేశారు. జర్నలిస్టుల కాలనీకి రోడ్లు, విద్యుత్, తాగునీరు, వీధి దీపాలు వంటి సౌకర్యాల కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా పరిపాలనను ఆదేశించినట్లు ఏపీజేఎఫ్ నేతలు తెలిపారు. ఏపీజేఎఫ్ నేతలు మాట్లాడుతూ, కలెక్టర్ మరియు ఎంపీ ఇద్దరూ సానుకూలంగా స్పందించడం జర్నలిస్టు వర్గాలకు ఎంతో ధైర్యం కలిగించిందని తెలిపారు. జర్నలిస్టుల కాలనీ అభివృద్ధి త్వరలోనే వేగవంతం అవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

About Author