శ్రీ మద్ది అంజన్న సన్నిధిలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం
1 min read

అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు
సహాయకమిషనర్,కార్యనిర్వాహణాధికారిని ఆర్.వి. చందన
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:శ్రీరామనవమి పర్వదినము సందర్భంగా ఏలూరు జిల్లా, జంగారెడ్డి గూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు ఎర్ర కాలువ ఒడ్డున, తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానము నందు ఉదయం గం.9-00ని.ల నుండి “శ్రీ సీతారాముల కళ్యాణము” ఆలయ అర్చకులు మరియు వేద పండితులచే జరుపబడినది. ఈ కళ్యాణ కార్యక్రమములో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనినారు. అనంతరం శ్రీ స్వామి వారి తీర్ద ప్రసాదములు మరియు పానకం భక్తులకు అందజేసినారని ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలియజేసినారు.


