ఆదిత్య కళాశాలలో రెడ్ క్రాస్ సొసైటీ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు
1 min read

శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ సీఈవో శ్రీహరి
సేవా కార్యక్రమాలకు మా
విద్యార్థినీ,విద్యార్థులు, అధ్యాపకులు ముందు వరుసలో ఉంటారు
ప్రిన్సిపల్ వంగా వెంకటేశ్వరరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు ఆదిత్య డిగ్రీ కళాశాలలో స్వస్తినారీ-సశక్తు పరివార్ అభియాన్ భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ-ఏలూరు వారితో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ సి.ఇ.ఓ ఎం. శ్రీహరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విచ్చేసిన సీఈఓ ని శాలువా కప్పి పూల బొకే అందించి విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది, ప్రిన్సిపల్ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన అనారోగ్య బారిన పడి ఇబ్బందులు పడతారన్న అపోహలు విడనాడాలన్నారు. ఆ ఆలోచనని పూర్తిగా తుడిచి వేసి సమాజానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సేవలందించాలన్నారు.అది కేవలం ఒక అపోహ మాత్రమే అని రక్తదానం చేసిన రక్తదాతలు మరి కొంతమందికి తెలియజేయాలని సూచించారు.రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్: ఎం బి ఎస్ వి ప్రసాద్ మాట్లాడుతూ ఒకరి రక్తదానం చేయడంతో ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని,అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులకు మీరిచ్చిన రక్తంతో వారి జీవితకాలన్ని పెరుగుతుందని తెలియజేశారు. ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వంగా. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మా విద్యాసంస్థ నుండి ఇటువంటి సేవ కార్యక్రమాలు చేయటానికి విద్యార్థినీ, విద్యార్థులు అధ్యాపక సిబ్బంది ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా కళాశాల యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ శిబిరంలో 52 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్: ఆర్ ఎస్ ఆర్ కె. వర ప్రసాద్, సెక్రటరీ బి.బెన్నీ, పిఆర్ ఓ కె.వి.రమణ, ఆదిత్య డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డి.వి.వి ఫణికుమార్, ఎన్ ఎస్ ఎస్ కో-ఆర్డినేటర్ కె. హరిబాబు, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ పి.సౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


