సంచార చికిత్స కార్యక్రమం తనిఖీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం ఉదయం 11 గంటలకు నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బి. తాండ్రపాడు గ్రామములో ఆయుష్మాన్ మందిర్ లొ జరుగుచున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్. రఘు తనిఖీ చేశారు. అనంతరం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ బి డ్డ పుట్టిన వెంటనే అరగంటలోపు బిడ్డకు తల్లిరొమ్ము అందించి ముర్రుపాలు పట్టాలని,దీని వలన బిడ్డకు వ్యాధినిరోధకశక్తి ఎక్కువగా లభిస్తుంది,బిడ్డ శరీరానికి వెచ్చదనం లభిస్తుంది,తల్లితో త్వరగా అనుబంధనం ఏర్పడుతుందని తెలిపారు.పాలు పట్టక ముందు సాధరణంగా కొందరు గ్లూకోజు నీరు,చక్కెర నీరు,తేనెలాంటివి త్రాగిస్తారు,ఇవి చాలా ప్రమాదకరం ఇవి అవసరం లేదు,వీటిని త్రాగించరాదు.కేవలం తల్లిపాలు మాత్రమే త్రాగే వయస్సులో ఎక్కువ సార్లు మలవిసర్జన చేయడము సహజమే,3 లేదా 4 రోజుల వరకు మలవిసర్జన కాకపోవడము సహజమే,బిడ్డ హుషారుగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి,వేసవిలో కూడా పిల్లలకు మంచి నీరు,ద్రవ పదార్థాలు ఇవ్వకూడదని తెలిపారు.తల్లిపాలు ఇవ్వడంవలన గర్భసంచి మామూలు స్థితికి రావడానికి ఉపయోగపడుతుంది,ప్రసవానంతర రక్తస్రావం తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలొ క్షేత్ర స్థాయి పర్యవేక్షకురాలు ఎస్తేర్ రాణి, ఆరోగ్య కార్యకర్త కృష్ణవేణి, ఆశా కార్యకర్తలు హైమావతి, నారాయణమ్మ, మహేశ్వరి మరియు ప్రాజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు.

