NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే చేతుల మీదుగా కలచట్లలో ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ప్రారంభం

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని కలచట్ల గ్రామంలో ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ను డోన్ శాసనసభ సభ్యుడు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం సమావేశంలో వారు మాట్లాడుతూనేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) క్రింద కలచట్ల ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరికి తాగునీరు సద్వినియోగం చేసుకొని, అలాగే నాబార్డు నుంచి రైతులకు పనిముట్లు రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలు నాబార్డులో ఉన్నట్లు నాబార్డ్ సంస్థ వారు తెలిపారని అన్నారు. కనుక కలచట్ల గ్రామం ప్రజలు నాబార్డ్ సంస్థ నుండి వచ్చే పనిముట్లు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ ఉమ్మడి కర్నూల్ జిల్లా వై నాగేశ్వరరావు యాదవ్, ఎంపీపీ శ్రీనివాసులు, తిరపతి సీనియర్ నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి,ఎ.జి.ఎంA. (డిడి), నాబార్డ్, నంద్యాల జిల్లా  కె.ఆర్.డి. కార్తీక్, సొసైటి ఫర్ రూరల్ అండ్ ఎకో డెవలప్మెంట్ , నంద్యాల కలచట్ల గ్రామ వాటర్ షెడ్ కమిటి  ఏ.దామోదర్ రెడ్డి , కలచట్ల సర్పంచ్ రమాదేవి , తెదేపా నాయకులు కలచట్ల ప్రసాదు, కలచట్ల నాబార్డ్ కమిటీ చైర్మన్ బి .రాజ రుద్ర భూపతి , వైస్ చైర్మన్ డి. రంగస్వామి, ట్రెజరీ రవికుమార్, సెక్రెటరీ ఎం. శ్రీనివాసులు,మరియు కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఎన్. సుధాకర్, కే .ఓబులేసు, పి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author