NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రవీంద్ర ‘ లో బాలల దినోత్సవం..

1 min read

కర్నూలు , న్యూస్ నేడు:          స్థానిక అబ్బాస్ నగర్ లోని రవీంద్ర పాఠశాలల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రవీంద్ర హైస్కూల్ విభాగమునకు రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్యగారు, రవీంద్ర ప్రైమరీ విభాగమునకు అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ , వెంకాయపల్లినందున్న రవీంద్ర గ్లోబల్ స్కూలుకు వైస్ చైర్మన్ జి.వంశీధర్   ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా జి. పుల్లయ్య   మాట్లాడుతూ నేడు పిల్లల పండుగ జరుపుకోవడానికి కారణమైన నాటి మన భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ  తన దూరదృష్ఠితో తీసుకున్న నిర్ణయాల వల్లే భారతదేశం ఈనాడు ప్రపంచంలోనే గొప్ప శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందన్నారు. భావిభారత పౌరులుగా ఉన్నటువంటి మీరు భారతదేశ స్థితిగతులను మార్చే దిశగా ఎదగాలన్నారు. మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ, దేశాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. డాక్టర్ మమతా మోహన్  మాట్లాడుతూ నేటి విద్యార్థుల్లో అనంతమైన సృజనాత్మక శక్తి దాగి ఉందని దాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెరిగిపోతున్న పోటీ ప్రపంచంలో విజేతలుగా  నిలవాలన్నారు. క్రమశిక్షణతో కూడిన విజ్ఞానం భావి జీవితానికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. వైస్ చైర్మన్ జి. వంశీధర్  మాట్లాడుతూ విద్యార్థులు  నిరంతర శోధన చేస్తూ మానవాళికి ఉపయుక్తమైన నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ఈ కార్యక్రమాలలో పాఠశాలల సమన్వయకర్తలు టి.చంద్రశేఖర్, శ్రీమతి జి. హేమలత, శ్రీమతి భార్గవి, శ్రీమతి సౌమ్య, శ్రీమతి అపర్ణ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగినది.

About Author