రిడ్జ్ పాఠశాలలో ఘనమైన వేడుకలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రిడ్జ్ పాఠశాలలో పండిత నెహ్రూ జన్మదిన వేడుకలు మరియు పాఠశాల విద్యార్థి నాయకత్వ వేడుకల సంబరాలు అంబరాలుంటాయి. చాచా నెహ్రూ జన్మ దినాన్ని పురస్కరించుకొని విద్యార్థి బృందం ఉత్సాకరమైనటువంటి నృత్య కళాప్రదర్శనతో చూపరులను ఆకట్టుకున్నారు. అంతేకాక గొప్ప నాయకుడైన చాచా జన్మదిన వేడుకల్లో భాగంగా రిడ్జ్ పాఠశాల యాజమాన్యం పాఠశాల విద్యార్థు.ల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే క్రమంలో విద్యార్థి “అధికార స్వీకరణ వేడుకను” ఘనంగా చేపట్టింది. ఈ వేడుక ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు. క్రమశిక్షణ. బాధ్యత. సేవా భావం. మరియు ఆదర్శంగా నిలిచే గుణాలు పెంపొందుతాయి. పాఠశాల యొక్క విలువలు. నియమాలు. సాంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఈ కార్యక్రమంలో విద్యార్థులకు లభిస్తుంది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థుల సమక్షంలో ఈ చిన్నారి నాయకులు తమ కర్తవ్యాలు నిజాయితీగా, ధైర్యంగా నిర్వర్తించేందుకు ప్రమాణస్వీకారం చేశారు. ఇది పాఠశాల జీవితంలో ఒక చిరస్మరణీయమైన మరియు గౌరవనీయమైన సందర్భంగా నిలుస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల సీ.ఈ.ఓ గోపినాథ్ , కో సీ.ఈ.ఓ సౌమ్య గోపీనాథ్, డీన్ రాజేంద్రన్ , ప్రధానోపాధ్యాయులు రాజ్ కమల్ ఈ వేడుకను ఉద్దేశించి విద్యార్థులతో మాట్లాడుతూ కేవలం చదువుల్లోనే కాకుండా తమ తమ పాఠశాల విద్యార్థులు భాద్యతల పట్ల భావి భారత కాంతి కిశోరాలు కావాలని, జాతికి, దేశానికి తిరుగులేని ఘనకీర్తి సంపాదించి పెట్టాలని ఆకాంక్షించారు.

