చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి గిరిజన ప్రాంత ఆసుపత్రిగా గుర్తింపు
1 min read

ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవ తో స్పెషాలిటీ వైద్యుల రాకకు మార్గం సుగమం
ఈ మేరకు జీవో విడుదల చేసిన ప్రభుత్వం
ఏలూరు న్యూస్ నేడు: చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి గిరిజన ప్రాంత ఆసుపత్రిగా గుర్తింపు లభించింది. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో స్పెషాలిటీ వైద్యుల రాకకు మార్గం అనుకూలమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. చింతలపూడి కమ్యూనిటీ ఆసుపత్రి సూపర్నెంట్ మరియు వైద్యులు , ఆస్పత్రి అభివృద్ధి మరియుసలహా సంఘం సభ్యులు ఎమ్మెల్యే దుశ్యాలువ,పూలబొకే తో ఘనంగా సత్కరించారు.చింతలపూడి వంటి మారుమూల ప్రాంతాలకు వైద్యుల కొరతను తీర్చడానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.చాలాకాలంగా భర్తీ కానీ వైద్యుల పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి అధిక వేతనం చెల్లించే విధంగా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి జాబితాలో చేర్చారు. దాంతో వైద్యులు రాకకు మార్గం సులభతరం కానుంది. అంతేకాకుండా ఇచ్చే మందులు ఇతర సౌకర్యాలు, రాయితీలు వేలాదిమంది కి లభించనున్నాయని తెలిపారు.

