జిల్లా జీడీడీపీ (స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి) సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి
1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా జీడీడీపీ (స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి) సాధించడమే ప్రధాన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, జీడీడీపీ, కీలక పనితీరు సూచికలు, ఏపీఎస్ఎఫ్ఎల్, ఏపీఎస్పీడీసీఎల్ , పర్యాటకం, పెట్టుబడులు, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12 శాఖలలో వ్యవసాయ శాఖ, పశువర్ధక శాఖ, బ్యాంకింగ్, డిటిసి శాఖలు వంద శాతం కంటే ఎక్కువ పురోగతి సాధించడం అభినందనీయమని తెలిపారు. అదే సమయంలో ఉద్యాన శాఖ, బీఎస్ఎన్ఎల్, జీఎస్టీ తదితర శాఖలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదని, వీటిని గుర్తించి నిర్దేశించిన కాలవ్యవధిలో లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని ఆదేశించారు.జిల్లా అభివృద్ధి, ఆర్థిక పురోగతి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్ష అనంతరం ‘స్వర్ణాంధ్ర – మన సంకల్పం విజన్ – 2047’ క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులు కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


