మున్సిపల్ నాల్గవ తరగతి ఉద్యోగులకు పాదరక్షలు అందజేసిన కో-ఆప్షన్ సభ్యులు
1 min read

స్త్రీలకు,పురుషులకు 296 మందికి పాదరక్షలు అందజేత
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మున్సిపల్ కార్మికులు సక్రమంగా విధులు నిర్వహించేందుకు వారిని ప్రోత్సహిస్తూ వారికి ఇవ్వవలసిన బెనిఫిట్స్ అన్ని సకాలంలో అందిస్తున్నామని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు తెలిపారు గురువారం కార్పొరేషన్ కార్యాలయం మేయర్ ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో నాలుగవ తరగతి ఉద్యోగులు ఒక్కొక్కరికి నాలుగు జతల పాదరక్షలను అందజేశారు.ఈ సందర్భంగా కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,మేయర్ నూర్జహాన్ పెదబాబు,కమిషనర్ ఏ.భాను ప్రతాప్ సమన్వయంతో కార్మికులకు ఇవ్వవలసిన బెనిఫిట్స్,ప్రమోషన్స్,ఏరియర్స్ అన్ని సకాలంలోఇచ్చి కార్మికులను సంతోషపెట్టి వారితో సక్రమంగా విధులు చేయిస్తున్నామన్నారు.సంవత్సరానికి 2 జతల పాదరక్షలు చొప్పున రెండు సంవత్సరాలకు సంబంధించి ఒక్కొక్కరికి నాలుగు జతలు పాదరక్షలు స్త్రీ పురుషులు 296 మందికి ఈరోజు అందజేశామని ఎస్ ఎం ఆర్ పెదబాబు తెలిపారు. శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,మేయర్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో నగర ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు వీధిలైట్లు,రోడ్లు, డ్రైనేజీలు,మంచినీరు, పారిశుద్ధ్యo విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నాలుగు ప్రాంతాల్లో 40 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామనీ తెలిపారు.వీధిలైట్ల విషయానికి వస్తే 17 వేల 500 వీధిలైట్లు సక్రమంగా ఎలిగే విధంగా వాటికి సంబంధించిన అన్ని రకాల స్పేర్ పార్ట్స్ సిద్ధం చేశామని కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్.డి.శ్రీనివాస్,బి.శివారెడ్డి,సూపర్నిండెంట్ సిరాజుద్దీన్,కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు,ఎర్రంశెట్టి నాగబాబు,పాము శ్యామ్యూల్ తదితరులు పాల్గొన్నారు .


