లడ్డు తయారీలో వాడింది ముమ్మాటికి కల్తీ నెయ్యి .. తేల్చిచెప్పిన సిట్ అధికారులు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: 2019 నుండి 2024 వరకు ఉన్న గత వైసిపి ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో వాడింది ముమ్మాటికి కల్తీ నెయ్యి అని సిట్ అధికారులు తేల్చినందున తెలుగుదెశంపార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఈ రోజు కర్నూలు నగర పార్టీ అధ్యక్సులు కొరకంచి రవికుమార్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం నందు పూజారుల సమక్షంలో దేవాలయం సంప్రోక్షణ చేసి పూజలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గుడిసె ఆది క్రిష్ణమ్మ, పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర బొందిలి కార్పోరేషన్ చైర్మన్ విక్రం సింఘ్, రాష్ట్ర డైరెక్టర్లు సంజీవ లక్ష్మి (బోయ కార్పోరేషన్), ఆనంద రావు (బ్రాహ్మణ కార్పోరేషన్), జిల్లా పార్టీ కమిటీ సభ్యులు సోమిసెట్టి శ్రీకాంత్ (ఉపాధ్యక్షులు) రాజశేఖర రెడ్డి (కార్యాలయ కార్యదర్శి), కార్పోరేటర్లు సుంకన్న, కె.పరమేష్, శ్రీయుతులు పెనికలపాటి నాగేశ్వరరావు, రవి మొదలగూ వారితో పాటూ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

