NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి

1 min read

స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్థిరమైన ఉపాధి

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)

రానున్న రోజుల్లో మహిళలకు  రిజర్వేషన్లు 50 శాతం పెరిగే అవకాశం

మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు

పట్టణ పేదల ఉపాధి అభివృద్ధి కోసం మెప్మా

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.  రానున్న రోజుల్లో మహిళలకు రిజర్వేషన్లు 50 శాతానికి పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల అన్ని రంగాల్లో మహిళలు మరింతగా రాణించేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.  పట్టణ పేదల ఉపాధి అభివృద్ధి కోసం మెప్మా, ఎన్ ఇ సి సి  సంయుక్తంగా అమలు చేస్తున్న ఎగ్ కార్ట్ స్కీం కింద ఏలూరు కార్పొరేషన్ పరిధిలో నలుగురు స్వయం సహాయక మహిళలకు మంజూరైన కార్టులను మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుతో కలిసి ఆయన పంపిణీ చేశారు. పట్టణ ప్రాంతాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో మెప్మా, ఎన్ ఇ సి సి ఆధ్వర్యంలో ఎగ్ కార్ట్ స్కీమును అమలు చేస్తున్నారు. 50 వేల రూపాయల ఎగ్ కార్ట్ ను అందించడంతోపాటు వంట సామాగ్రిని కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. దీనిలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో నలుగురు స్వయం సహాయక సభ్యులకు ఎగ్ కార్టులను ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ స్వయం సహాయక సభ్యులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో  ముందంజ వేసేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు ఎగ్ కార్ట్  పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం,  ఎస్ఎంఆర్ పెదబాబు, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జీలు,కార్పొరేషన్ కమిషనర్ భాను ప్రతాప్, మెప్మా జిల్లా కోఆర్డినేటర్ మహాలక్ష్మి, మెప్మా టౌన్ కోఆర్డినేటర్ ఝాన్సీ  తదితరులు పాల్గొన్నారు.

About Author