NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయవాద ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ గా 71 ఓట్లతో నిమ్మల జ్యోతి కుమార్ ఘన విజయం

1 min read

సత్కరించిన ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు

తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన నిమ్మల జ్యోతి కుమార్

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా కోర్టులో జరిగిన ఏలూరు న్యాయవాద సంఘం ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ (ప్రధాన కార్యదర్శి) గా జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్  71 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈరోజు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ రీజియన్ జోన్-టు చైర్మన్  రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిమ్మల జ్యోతి కుమార్ ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. నిమ్మల జ్యోతి కుమార్ మాట్లాడుతూ నా ఈ విజయానికి సహకరించిన ఏలూరు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, తనతోటి సహచర న్యాయవాదులకు కృతజ్ఞతలు, అలాగే ఈ విజయంలో సహకరించిన అబ్బినేని విజయ్ గారికి టీమ్ సభ్యులందరికీ ధన్యవాదాలు.అలాగే ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు కి ఏలూరు జనసైనికులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పొలిమేర దాసు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు.

About Author