NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సరైన సమయంలో వేస్తేనే పంట అధిక దిగుబడి

1 min read

శిక్షణా కార్యక్రమంలో జిల్లా సైంటిస్ట్ డాక్టర్ సుజాత..

న్యూస్ నేడు నందికొట్కూరు: పంటలు సరైన సమయంలో వేస్తేనే పంటలు అధికంగా దిగుబడి వస్తాయని నంద్యాల జిల్లా వనరుల కేంద్రం సైంటిస్ట్ డాక్టర్ సుజాత అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని వ్యవసాయ ఆత్మ కార్యాలయంలో బుధవారంజాతీయ ఆహార మరియు పోషక భద్రత పథకం(ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం) బృంద ప్రదర్శన క్షేత్రంలో జరిగిన కంది పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు సూచనల గురించి రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం గిరీష్, మండల వ్యవసాయ అధికారి పి షేక్షావలి ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుజాత మాట్లాడుతూ కంది పంటను సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే పంటను  వేసుకోవాలని అలాకాకుండా ఆలస్యంగా పంటలు వేసుకోవడం వల్ల పంట దిగుబడి రాదు,వర్షాలు సరిగ్గారాకపోవడం వల్ల పంట దిగుబడి రాదని వీటివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.వీటిని రైతులు గమనించాలని డాక్టర్ సుజాత రైతులతో అన్నారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ వ్యవసాయ అధికారి ఫణీ శ్వర్ రెడ్డి,రైతులు మరియు వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author