ప్రపంచ జనాభా దినోత్సవం 2025 పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టరు
1 min read

గర్భధారణల మధ్య సమయాన్ని పాటిస్తే ఆరోగ్యకరమైన పిల్లలు జన్మిస్తారు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం 2025 పోస్టర్లను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రణాళికా బద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన సమయం మరియు అంతరం చాలా అవసరం అని అన్నారు. గర్భధారణ మధ్య ఆరోగ్యకరమైన సమయాన్ని పాటించి నట్లయితే ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చుటకు అవకాశం కలుగుతుందని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి కోరారు. తల్లి కావడానికి సరైన వయసు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండుటకు వివాహ వయస్సును ఆడవారికి 21 సంవత్సరాలు మగవారికి 25 సంవత్సరాలు పాటించాలన్నారు. గర్భీణీల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని, పోషకాహారం, ఆస్పత్రి ప్రసవాలు, నవజాత శిశు సంరక్షణ, తల్లిపాలు అనుబంధ ఆహారం వంటి వాటి ఆవశ్యకతను తల్లులకు తెలియజేసి మాతృ, శిశు మరణాలు అరికట్టడానికి ఆరోగ్య సిబ్బంది పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృత, డిసి హెచ్ ఎస్ డా:పాల్ సతీష్, ఎన్టీఆర్ వైద్యసేవ కో-ఆర్డినేటరు డా.రాజీవ్,యస్ వో యన్.ఆనంద్ కుమార్, ఏయస్ వో యం.కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

