సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం
1 min read

ఆలూరు పట్టణంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించిన బి.వీరభద్రగౌడ్
సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం
ఆలూరు నేడు న్యూస్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటి అండ్ మానవవనరుల,విద్యాశాఖ మంత్రి వర్యులు .నారా లోకేశ్ బాబు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు యాదవ్ ఆదేశానుసారం.మన ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వీరభద్రగౌడ్ ఆలూరు పట్టణంలోపర్యటించారు. ముఖ్యంగా ఇంచార్జి వర్యులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకొని వారి వివరాలను బూత్ ఇంఛార్జీలతో మై టిడిపి యాప్లో అప్లోడ్ చేయించారు.ఈకార్యక్రమానికి మండల కన్వీనర్ తో పాటు ఆలూరు పట్టణ,మండల టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మండల టీడీపీ క్లస్టర్,యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి లు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు తెలుగు యువత,ఐటీడీపి, టిఎన్ఎస్ఎఫ్ , టీడీపీ,,టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధులు మండల అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.

