NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆహార భద్రతపై సదస్సు..

1 min read

ఆదోని, న్యూస్​ నేడు: జాగ్రత్త.. మీరు తినే ఆహారం అమృతమా? విషమా? ఆదోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆహార భద్రతపై సదస్సు. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లో కల్తీ మహమ్మారి ఎలా దాగి ఉందో విద్యార్థులకు వివరించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశాల మేరకు ఆదోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి (DFSO ) రాజగోపాల్ రావు ముఖ్య అతిథిగా హాజరై, కల్తీ పదార్థాలను గుర్తించే విధానాలపై విద్యార్థినులకు లోతైన అవగాహన కల్పించారు.క్యాన్సర్‌కు కేరాఫ్ అడ్రస్.. రంగు రంగుల తినుబండారాలుఈ సందర్భంగా రాజగోపాల్ రావు మాట్లాడుతూ, మార్కెట్లో దొరికే ఆకర్షణీయమైన రంగుల వెనుక ప్రాణాంతకమైన వ్యాధులు దాగి ఉన్నాయని హెచ్చరించారు. పింక్ పీచు మిఠాయి (Cotton Candy): చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిలో ‘సాక్రిన్’ మరియు నిషేధిత రంగులు వాడుతున్నారని, దీనివల్ల చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.కూల్ డ్రింక్స్ & సోడా: సోడాలలో కలిపే కృత్రిమ రంగులు క్యాన్సర్‌కు ఆహ్వానం పలకడమేనని స్పష్టం చేశారు.ప్రజలు నిత్యం వాడే వస్తువులలో కల్తీని ఎలా కనిపెట్టాలో ఆయన ప్రాక్టికల్‌గా వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్స్యూమర్ ఫోరం  జడ్జిలు నారాయణరెడ్డి నజమ కౌసర్, జిల్లా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఫోరం ప్రధాన కార్యదర్శి శివ మోహన్ రెడ్డి ఆదోని డివిజన్ అధ్యక్షుడు ఈశాభాషా తూనికల కొలతల శాఖ అధికారి శ్రీనివాసులు కాలేజీ ప్రిన్సిపల్ సంజన్న , ఆదోని ఫోరం ఇంచార్జ్ గౌసుల్ వరా మరియు జిల్లా స్థాయి  అధ్యాపక బృందం వందలాది మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రదర్శించిన కొన్ని ప్రయోగాలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *