అంగన్వాడి టీచర్ పద్మ మృతి బాధాకరం..
1 min read

ఏఐటీయూసీ, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ చంద్రకళ..
మృతి చెందిన అంగన్వాడి టీచర్ పద్మ ఫైల్ ఫోటో
చాగలమర్రి , న్యూస్ నేడు: మండల కేంద్రమైన చాగలమర్రిలోని బుగ్గరస్తా వీధి 5 వ అంగన్వాడి కేంద్రం అంగన్వాడి టీచర్ పద్మ మృతి బాధాకరమని ఏఐటియుసి అనుబంధ సంస్థ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ అన్నారు. శనివారం మృతి చెందిన పద్మ ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి టీచర్ పద్మ 24 సంవత్సరాల నుండి టీచరుగా విధులు నిర్వహిస్తూ లబ్ధిదారుల పట్ల ఓర్పు సహనం కలిగి పౌష్టికాహారం, ఆరోగ్య సలహాలు, పలు సూచనలు ఇవ్వడంలో ఆసక్తి కలిగి విధుల పట్ల అంకిత భావం కలిగి ఉండేదన్నారు. పద్మావతి పట్ల ఆళ్లగడ్డ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని తేజేశ్వరి, సంతాపం తెలుపుతూ ప్రభుత్వం నుండి మంజూరయ్యే నిధులను మంజూరు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు. సూపర్వైజర్ సుశీల, అంగన్వాడి టీచర్లు హసీనా వహీదా, ఇందుమతి, మై మూన్, రహమత్, మండల కేంద్రంలోని పలువురు టీచర్లు, వివిధ గ్రామాల అంగన్వాడి టీచర్లు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.

