NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్మాణాలు పూర్తి..

1 min read

మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోజరుగుతున్న మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్మాణాలను నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మంగళవారం పనులను పరిశీలించారు.నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నిధులు 30 లక్షలతో పట్టణంలోని ఆరు మినరల్ వాటర్ ప్లాంట్లకు నిధులు మంజూరు అయ్యాయి.వాటి ద్వారా 5 మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్మాణాల వివరాలు: ప్రభుత్వ ఆసుపత్రి,పగిడ్యాల రోడ్డు బైరెడ్డి నగర్,ప్రభుత్వ డిగ్రీ కళాశాల,సంత గేట్ పాఠశాల, సీయస్ఐ పాలెం స్కూల్ లో మినరల్ వాటర్ ప్లాంట్లు కట్టిస్తున్నామని చైర్మన్ సుధాకర్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో పగిడ్యాల రోడ్డు,బైరెడ్డి నగర్ లో నిర్మాణాలు పూర్తి అయ్యాయని అన్నారు.పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎంపీ సహకారంతో సమారు 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లద్వారా ప్రజలకు మంచినీటిని అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో  మున్సిపల్ డీఈఈ నాసీర్, ఏఈ దినేష్,కౌన్సిలర్ పి చాంద్ బాష,మనోజ్ రెడ్డి పాల్గొన్నారు.

About Author