NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:  ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనీ కోరుతూఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు మహిళా లెక్చరర్లు విజయవాడ ధర్నా చౌక్ లో 36 గంటల విజ్ఞాపన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్లుమాట్లాడుతూ. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో జీవో 114 ఇచ్చి అమలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేకపోవడంతో 36 గంటల విజ్ఞాపన దీక్ష చేపట్టామన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో అవసరమైతే, నిరవధిక సమ్మె, చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో కెఎస్ లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్సీ కే రత్నకుమారి అసోసియేషన్ ట్రెజరర్ మరియు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ తదితరులు పాల్గొన్నారు.

About Author