NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా భారత ప్రధాని జన్మదిన వేడుకలు

1 min read

హొళగుంద న్యూస్ నేడు : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ  జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకోవడం జరిగింది. హోళగుంద మండలంలో ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు భారతదేశ ముద్దుబిడ్డ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ  జన్మదిన వేడుకలు మరియు విశ్వకర్మ జయంతి వేడుకలు స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు బిజెపి కార్యకర్తలు  ఎన్​డీఏ కూటమి నాయకుల కేకు కట్ చేసి  భారత ప్రధాన మంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు బ్రెడ్లు ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు డాక్టర్ తిప్పయ్య, జనసేన కన్వీనర్ అశోక్ , వీరేష్ వలి భాషా, జిల్లా కిసాన్ మోర్చా  జనరల్ సెక్రెటరీ రామలింగ,మండల ప్రధాన కార్యదర్శి ఉల్లిగన్న, శివ రాజ్ కుమార్, బసవ జై గౌడ్ రాముడు దేవప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author