ఎన్‌ఏబిహెచ్ అక్క్రెడిటేషన్ పొందిన తొలి ఆసుపత్రిగా మెడికవర్ హాస్పిటల్స్
1 min read

ఎన్‌ఏబిహెచ్ (NABH ) సర్వైలెన్స్ from Quality Contirol of India ( QCI) ( 6వ ఎడిషన్) విజయవంతంగా పూర్తి – మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు
కర్నూలు, న్యూస్ నేడు: మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు లో 04 ఏప్రిల్ 2026న ఎన్‌ఏబిహెచ్ (NABH) సర్వైలెన్స్ – 6వ ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో 2018లోనే ఎన్‌ఏబిహెచ్ అక్క్రెడిటేషన్ పొందిన తొలి ఆసుపత్రిగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు 6వ ఎడిషన్ సర్వైలెన్స్‌ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా నాణ్యమైన వైద్య సేవలలో మరో మైలురాయిని చేరుకుంది.ఈ సర్వైలెన్స్ ప్రక్రియలో ప్రిన్సిపల్ అసెసర్ డా. సి. సుశీల, అసెసర్లు మిస్ బిందు బాల చంద్ర, డా. రాజేష్ బి పాల్గొని ఆసుపత్రిలో అమలు చేస్తున్న వైద్య ప్రమాణాలు, భద్రతా విధానాలు, రోగి సంరక్షణ నాణ్యతను సమగ్రంగా పరిశీలించారు.ఎన్‌ఏబిహెచ్ అక్క్రెడిటేషన్ అనేది ఆసుపత్రి నాణ్యతను సూచించే అత్యున్నత ప్రమాణాలలో ఒకటి. ఇది రోగి భద్రత, సేవల నాణ్యత, పరిశుభ్రత, వైద్య విధానాల సరైన అమలు వంటి అంశాలను నిర్ధారిస్తుంది. ఈ ప్రమాణాలను అనుసరించడం ద్వారా రోగులకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించగలుగుతామని వైద్యులు తెలిపారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “ఎన్‌ఏబిహెచ్ అక్క్రెడిటేషన్ అనేది మా ఆసుపత్రి నాణ్యతకు ప్రతీక. రోగులకు సురక్షితమైన మరియు నాణ్యమైన వైద్య సేవలు అందించడం మా ప్రధాన లక్ష్యం. 6వ ఎడిషన్ సర్వైలెన్స్ విజయవంతంగా పూర్తి కావడం మా బృందం కృషికి నిదర్శనం” అని తెలిపారు.డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా. అరుణ రెడ్డి మాట్లాడుతూ, “ఎన్‌ఏబిహెచ్ ప్రమాణాలు అనుసరించడం ద్వారా ప్రతి విభాగంలో సేవల నాణ్యతను మెరుగుపరచడం సాధ్యమవుతోంది. రోగి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, నిరంతరం మెరుగుదల సాధించడం మా లక్ష్యం” అని పేర్కొన్నారు. ఈ సర్వైలెన్స్ ద్వారా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు నాణ్యమైన వైద్య సేవల అందింపులో తన కట్టుబాటును మరోసారి నిరూపించింది.

