క్వారీ కార్మికుల భద్రత సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
1 min read

సిఐటియు నాయకులు ఎం.రవిచంద్ర
పత్తికొండ ,న్యూస్ నేడు : క్వారీలో పనిచేసే కార్మికుల సంక్షేమం, భద్రత లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని కనీసం వారి భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని శనివారం పట్టణంలోని కామ్రేడ్ దివంగత మాజీ ఎమ్మెల్యే ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి భవనంలో ఏర్పాటుచేసిన క్వారీ కార్మికుల సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర పేర్కొన్నారు. ఈ సమావేశాని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్వారీ కార్మికుల కోసం భద్రతా నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని గనుల చట్టం, 1952 చట్టంలో రూపొందించబడిన నియమ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డిజిఎంఎస్) దీనిని పర్యవేక్షించాలని వారు డిమాండ్ చేశారు. క్వారీ కార్మికులకు సామాజిక భద్రత కోసం బీమా సౌకర్యం కల్పించాలని వయోపరిమితి 45 సంవత్సరాలకే పింఛన్ అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియ నాయకులు డి. గోపాల్ ప్రజానాట్మండలి జిల్లా కార్యదర్శి పెద్ద కాసిం, ప్రజానాట్మండలి మండల కార్యదర్శి రమేష్, వ్యవసాయ సంఘం జిల్లా నాయకులు సిద్దయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరంక్వారీ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది.క్వారీ కార్మిక సంఘం నూతన అధ్యక్షులుగా రంగన్న, కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా రామారావు, ఉపాధ్యక్షులుగా గోపాల్, కోశాధికారిగా రంగనాథులను ఎన్నుకున్నారు.

