ఉచిత క్యూలైన్ ద్వారా మల్లన్నను దర్శించుకున్న జిల్లా కలెక్టర్
1 min read

సుమారు 20 నిమిషాల్లో మల్లన్న దర్శనం పూర్తి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
శ్రీశైలం / నంద్యాల, న్యూస నేడు: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలం దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఉచిత క్యూలైన్ ద్వారా సాధారణ భక్తులతో కలిసి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఉచిత దర్శన క్యూలైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, శానిటేషన్ సదుపాయాలు, వైద్య సేవలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉచిత క్యూలైన్ ద్వారా భక్తులకు తక్షణ దర్శనం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. మహాశివరాత్రి వేళల్లో భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, భక్తులు సంయమనం పాటిస్తూ, శివనామ స్మరణతో, దేవాలయ నియమ నిబంధనలు అనుసరిస్తూ దర్శనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


