NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు అండగా..మందడి దొరబాబు

1 min read

పరీక్ష సామాగ్రిని అందజేసిన దొరబాబు రెడ్డి..

న్యూస్ నేడు నందికొట్కూరు: పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అండగా నిలిచారు టిడిపి యువనేత మందడి దొరబాబు..నంద్యాల జిల్లాజూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు తరిగోపుల  గ్రామ టిడిపి యువ నాయకులు మందడి దొరబాబు రెడ్డి బుధవారం విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేశారు.పరీక్షకు అవసరమయ్యే ప్యాడ్,పెన్,పెన్సిల్,ఎరైజర్, షార్ప్నర్,స్కేల్,వాటర్ బాటిల్ అందజేశారు.ఈ సందర్భంగా మందడి దొరబాబు రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ కుమార్,ఉపాధ్యాయులు శ్రీనివాసులు, విజయలక్ష్మి,నాయకులు నాగార్జున,జబీవుల్లా,శరత్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author