NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండు లక్షల 60 వేలతో పరార్

1 min read

బ్యాంకులో డ్రా చేసుకొని వస్తుండగా వృద్ధుడికి మోసం

మిడుతూరు, న్యూస్​ నేడు: ఓ వృద్ధుడు బ్యాంకులో నగదును డ్రా చేసుకొని ఇంటికి వెళ్తుండగా ఆయనను మోసగించి 2 లక్షల 60 వేల నగదును వృద్ధుడుని మోసగించి నగదును తీసుకెళ్లిన సంఘటన మిడుతూరు మండలంలో చోటుచేసుకుంది.వృద్ధుడు మరియు స్థానికులు తెలిపిన వివరాల మేరకు చెరుకుచెర్ల గ్రామానికి చెందిన గుండం పెద్ద పుల్లారెడ్డి(60) నందికొట్కూరు పట్టణంలోనిస్టేట్ బ్యాంకులో మ 3 గం.ల సమయంలో 2 లక్షల 60 వేల నగదును డ్రా చేసుకుని తన బైక్ పై గ్రామానికి వెళ్తుండగా వీపనగండ్ల బాట దగ్గర గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఒక బైకుపై వస్తూ వారి వద్దనున్న 100 రూ.ల నోట్లు కిందపడేసి పెద్దయ్య నీ డబ్బులు కింద పడ్డాయి చూసుకో అని యువకులు వృద్ధుడికి చెప్పారు.వృద్ధుడు తన బైక్ ను ఆపి వెనక్కి వెళ్లి వారు వేసిన నోట్లను తీసుకుంటుండగా బైకు పైన ముందర బ్యాగ్ లో పెట్టుకున్న నగదు కవర్ ను వారు తీసుకొని వెంటనే అక్కడ నుండి యువకులు పరార్ అయ్యారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఓబులేష్ తెలిపారు.తర్వాత నందికొట్కూరు పట్టణంలో డిగ్రీ కాలేజీ తదితర ప్రాంతాలను సీసీ కెమెరాలను ఎస్సై మరియు సిబ్బంది పరిశీలించారు.

About Author