“క్షయ వ్యాధి పై వ్యాసరచన క్విజ్ పోటీలు”..
1 min read

కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు
కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం 2026ను దేశాల ఆధ్వర్యంలో, ప్రజల శక్తితో క్షయాన్ని అంతం చేయవచ్చు” అనే థీమ్‌తో మంగళ 5వారం (మార్చి 24, 2026) కర్నూలు మెడికల్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కమ్యూనిటీ మెడిసిన్ విభాగం, పల్మనరీ మెడిసిన్ విభాగం మరియు డిటీడీసీ సంయుక్త ఆధ్వర్యంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీ నిర్వహించగా మొత్తం 63 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో అక్షయ పి (ఫైనల్ ఇయర్ పార్ట్ I) ప్రథమ స్థానం, అలేఖ్య పి ద్వితీయ స్థానం, తేజశ్రీ (ఫస్ట్ ఇయర్ యం.బి.బి.యస్) తృతీయ స్థానం సాధించారు.అలాగే అన్ని విభాగాల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం క్విజ్ పోటీ నిర్వహించబడింది. ఈ క్విజ్ పోటీలో టీమ్ A (డా. సాయి సౌమ్య – కమ్యూనిటీ మెడిసిన్, డా. జి. శ్రీలక్ష్మి – కమ్యూనిటీ మెడిసిన్, డా. నిలొఫర్ భాను – పాథాలజీ, డా. రూపకీర్తి – పల్మనరీ మెడిసిన్, డా. సాయి స్వేత – జనరల్ మెడిసిన్, డా. ఆర్. నవ్య – రేడియోడయాగ్నోసిస్, డా. సరసుస్మిత, డా. ఆప్తాల మాల జి, డా. సాయి లాస్య – రేడియాలజీ) ప్రథమ బహుమతి సాధించారు.ద్వితీయ బహుమతిని డా. సబీహా (కమ్యూనిటీ మెడిసిన్), డా. మంజుశ్రీ (పాథాలజీ), డా. నాగారిషిత్ (జనరల్ మెడిసిన్), డా. హరిప్రియా (పల్మనరీ మెడిసిన్) బృందం గెలుచుకుంది.ఈరోజు క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఇటీవల నిర్వహించిన వ్యాస రచన మరియు క్విజ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయబడింది. ఈ సందర్భంగా విజేతలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్స్ ఇండియా శుభప్రదలు వారిని అభినందించడం జరిగింది.క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని, సమాజంలో అవగాహన పెంపొందించడంలో యువత కీలక పాత్ర పోషించాలని ప్రిన్సిపల్ సూచించారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్ విభాగాల అధ్యాపకులు డాక్టర్ అరుణ, డా.రేణుక,డా. వెంకటేశ్వర్లు డా.పుష్పలత డా.ప్రవీణ డా.ప్రసన్న రాణి డా.రవి నాయక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

