ప్రకాశం జిల్లా అభ్యాస వర్గ.. కందుకూరు
1 min read

ప్రకాశం, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రకాశం జిల్లా అభ్యాస వర్గ కార్యక్రమం కందుకూరులోని ప్రాంత కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యనారాయణ మరియు రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్ హాజరైనారు. ఈ శిక్షణా తరగతులలో పలు విషయాల గురించి చర్చించడం జరిగినది, ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి పాటుపడాలని కార్యకర్తలను పెంచుకోవాలని తెలిపారు. రాష్ట్ర సహాధ్యక్షులు శ్రీ చక్రపాణి మాట్లాడుతూ ఆపస్ కార్యకర్త అంటే వ్యవస్థలో ఆదర్శంగా ఉండాలని తెలియజేశారు. సంఘటన కార్యదర్శి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల క్షేమం కోసమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలని విద్యావ్యవస్థను బాగు చేయాలంటే ఉపాధ్యాయులే మూలమనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి శ్రీ ఆకురాతి బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఉపాధ్యాయులకు రావలసిన డిఏలు మరియు బకాయిలు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ప్రకాశం జిల్లా అధ్యక్షులు కే మల్లికార్జున మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాలలో ఆపస్ వృద్ధి చెందాలని తెలిపారు. ఈ సందర్భంగా కందుకూరులో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

