NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

SIR పై నిర్లక్ష్యం వహించవద్దు – ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలి

1 min read

ఓటర్ల జాబితా పునఃపరిశీలనపై

అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు

ఆలూరులో ఘనంగా నిర్వహించిన SIR అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి

ఆలూరు న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఓటు హక్కు పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని ఓటర్ల జాబితా పునఃపరిశీలన ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి పిలుపునిచ్చారు.ఈరోజు ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అవగాహన సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ SIR కమిటీ సభ్యులు  రాజేష్ రెడ్డి, బాలకోటరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు  రామచంద్రారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  వైకుంఠం మల్లికార్జున చౌదరి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), పార్టీ నాయకులు, కార్యకర్తలకు SIR ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు, ఇతర సవరణలకు సంబంధించిన అంశాలను నాయకులు వివరించారు.సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కేవలం ఎన్నికల ప్రక్రియలో భాగం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే కీలక కార్యక్రమమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు గ్రామ స్థాయిలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ఒక్క అర్హుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా, ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు పరిశీలించాలని, కొత్తగా అర్హత పొందిన యువతను ఓటర్లుగా నమోదు చేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఓటు హక్కు పరిరక్షణ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, ప్రజాస్వామ్య పరిరక్షణలోనూ పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ప్రతి బూత్‌ను పార్టీకి బలమైన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని అన్నారు. ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.అలాగే రాష్ట్ర పార్టీ SIR కమిటీ సభ్యులు శ్రీ రాజేష్ రెడ్డి, శ్రీ బాలకోటరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. ఓటర్ల వివరాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల అంశాలపై బీఎల్‌ఏలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించారు.ఈ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, బూత్ ఏజెంట్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల కన్వీనర్లు, SIR కమిటీ సభ్యులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *