ఏలూరు మండల జీఎస్ డబ్ల్యు ఎస్ అధికారిగా విష్ణువర్ధన్ బాధ్యతలు
1 min read

అభినందనలు తెలియజేసిన పలువురు డిఇ.ఏఈ,మండల అధికారులు,కాంట్రాక్టర్లు కార్యాలయాల సిబ్బంది
చింతమనేని విష్ణువర్ధన్
ప్రభుత్వ పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తా
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా పరిషత్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చింతమనేని విష్ణువర్ధన్ బదిలీపై ఏలూరు రూరల్ మండలం జిఎస్ డబ్ల్యుఎస్, అధికారిగా చింతమనేని విష్ణువర్ధన్ శుక్రవారం ఏలూరు మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మండలంలో సచివాలయల ద్వారా ప్రభుత్వ పథకాల అమలు,సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా ప్రజలకు చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏలూరు ఎంపీడీవో ఏ జనార్దన్, డిప్యూటీ ఎంపీడీవో డి శ్రీనివాసరావు, ఏఈ మురళీకృష్ణ, విజయ కుమార్, ఎం సాయిరాం, ఎంపీడీవో గారపాటి నాగరాజుకుమారి మండల పరిపాలనా అధికారి పొన్నూరి సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ కడేమ్మ ,శివ మరియు ఆర్డబ్ల్యూఎస్ ఏలూరు సబ్ డివిజన్ డి.ఇ డి.రామారావు,ఏఈలు వర్మ , శ్రీకాంత్,పలువురు కాంట్రాక్టర్లు తదితరులు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు.

