దూరప్రాంతాలకు వెళ్లే వాహన డ్రైవర్లు కంటి సమస్యలపట్ల అప్రమత్తంగా ఉండాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: భారత్ పెట్రోలిమ్ కార్పొరేషన్ లిమిటెడ్ కర్నూల్ యల్. పి. జి బాటిలింగ్ ప్లాంట్ దూపాడు, బాలసాయి కంటి ఆసుపత్రి ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో భారత్ గ్యాస్ ను పంపిణీ చేసే వివిధ రాష్ట్రాలకు చెందిన వందమందికి పైగా డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంట్ మేనేజర్ జి. శివకుమార్ మాట్లాడుతూ దూరప్రాంత వాహన డ్రైవర్లు ఆరోగ్యావంతమయిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. తరచూ విద్యాపరీక్షలు చేయించుకుంటూ ఉండాలన్నారు.ప్లాంట్ హెచ్. ఎస్. ఎస్. యి. మేనేజర్ లతీఫ్ మాట్లాడుతూ డ్రైవర్లు కంటి ఆరోగ్యం పై నిర్లక్ష్యం వహించారాధని, ప్రమాదలకు గురి అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ వాహన డ్రైవర్లు మొబైల్, లాప్ టాప్ ల వాడకాన్ని వీలయినంత తగ్గించాలన్నారు. లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైజర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కంటి సమస్యలు ఉన్న డ్రైవర్లు వైద్యుల సూచనలమేరకు కంటి అద్దాలను నిర్ణీత సమయంలో నిర్లక్ష్యం చేయకుండా మార్చుకోవాలని లేకపోతే కంటి సమస్యలు తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయన్నారు.వీలయినప్పుడంతా కంటికి విశ్రాంతిని ఇవ్వడానికి ప్రయత్నించలన్నారు. కార్యక్రమంలో ప్లాంట్ సహాయ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

