NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రిడ్జ్ పాఠశాలలో ఘనంగా దసరా ఉత్సవం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్ పాఠశాలలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని “దసరా ఉత్సవం – 2025”ను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ పూలతో, రంగురంగుల అలంకరణలతో కళకళలాడగా, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు.సీఈఓ గోపీనాథ్  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ – “పండుగలు మనకు సాంప్రదాయాలను గుర్తుచేస్తాయి. దసరా ఉత్సవం మనలోని చెడు అలవాట్లను తొలగించి, సత్ప్రవర్తనకు మార్గం చూపుతుంది. విద్యార్థులు ఈ పండుగ ద్వారా ధైర్యం, నిజాయితీ, క్రమశిక్షణ వంటి విలువలను తమ జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి” అని సూచించారు.విద్యార్థులు పాటలు, నృత్యాలు, రూపకాలు ప్రదర్శించి ఉత్సవం ప్రత్యేకతను ప్రతిబింబించారు. చిన్నారులు దుర్గామాత స్తోత్రాలు ఆలపించి అందరి ప్రశంసలు పొందారు. ప్రత్యేకంగా అలంకరించిన బొమ్మల కొలువు అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కొలువును సందర్శించి దసరా పండుగ సాంప్రదాయాన్ని అనుభవించారు.ఈ దసరా ఉత్సవంలో కో-సీఈఓ సౌమ్య గోపీనాథ్ , డీన్ రాజేంద్రన్ , ప్రిన్సిపల్ రాజ్ కమల్  పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పాఠశాలలో పండుగ వాతావరణాన్ని సృష్టించారు.

About Author