NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆరోగ్యవంతమైన పిల్లలతోనే దేశ భవిష్యత్తు..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆరోగ్యవంతమైన పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాది అని   “స్వస్థనారీ-శశక్త్ పరివార్ అభియాన్” కర్నూలు మెడికల్ కాలేజ్ నోడల్ ఆఫీసర్  డాక్టర్ మాధవి శ్యామల అన్నారు. గురువారం ఆసుపత్రి యందలి చిన్న పిల్లల విభాగం లో “స్వస్థనారీ-శశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమం రెండో రోజులో బాగంగా “వ్యాధి నిరోధక టీకాల” పై అవగాహన  కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో వారు మాట్లాడుతూ తల్లులకు సూచన చేస్తూ ప్రభుత్వం వేల రూపాయల విలువైన 11రకాల  టీకాలను అందిస్తున్నదని దీని ద్వారా 12 రకాల వ్యాధులకు నుంచి పిల్లలకు రక్షణ కలుగుతుందన్నారు. ప్రతి తల్లి తమ బిడ్డలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని తద్వారా  పిల్లలు ఆ వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందుతారని  తెలిపారు. ప్రతి తల్లి టీకా కోసం పిల్లలని తీసుకెళ్లినప్పుడు విధిగా ఇమ్మనైజేషన్ కార్డు తీసుకెళ్లాలని షెడ్యూల్ ప్రకారం టీకా వేయించు కుంటేనే పూర్తి ఫలితాలు ఉంటాయని తల్లులకు తెలిపారు. టీకాల వల్ల ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ కలుగుతుందని టీకాల వల్లనే పోలియో, మశూచి, ధనుర్వాతము వంటి వ్యాధులను చాలావరకు నివారించగలిగామని కావున ప్రతి తల్లి తమ పిల్లలకు టీకాల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా విధిగా టీకాలు వేయించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిక్ విభాగపు ప్రొఫెసర్లు డాక్టర్ సుహాసిని, డాక్టర్ శారద అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీలత , డాక్టర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

About Author