NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తుఫాను  బాధితు లకు భరోసా కల్పించిన ఏలూరు జిల్లా ఎస్పీ

1 min read

కైకలూరు టౌన్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి మౌలిక సదుపాయాలపై ఆరా

బాధితులకు పండ్లు, బిస్కెట్ల పంపిణీ

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అర్ణబ్ తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఏలూరు జిల్లా ఎస్పీ  కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ బుధవారం పునరావాస కేంద్రాలను సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలను స్వయంగా కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.కేంద్రాల్లో అందుబాటులో ఉన్న తాగునీరు,ఆహారం,విద్యుత్, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

తుపాన్ బాధితులకు పండ్లు, బిస్కెట్ల పంపిణీ

తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి జిల్లా ఎస్పీ పండ్లు,బిస్కెట్లు పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ధైర్యంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు.

ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత

తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అధికారులు సూచించిన భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అనుమతి లేకుండా తిరిగి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని, తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకొరిగిన చెట్లు, పొంగి ప్రవహించే వాగులు, కాలువల సమీపంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ తెలిపారు.జిల్లా ఎస్పీ తో పాటుగా ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్,కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, కైకలూరు రూరల్ ఎస్సై రాంబాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *