NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమస్యలు పరిష్కారం కోసం పోరాడే సిపిఐ అభ్యర్థి ని గెలిపించండి

1 min read

 సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. కె. రామాంజినేయులు.

న్యూస్ నేడు, పత్తికొండ : సమస్యలు పరిష్కారం కోసం పోరాడే  పత్తికొండ పట్టణం ఏడవ ఎంపీటీసీ సిపిఐ అభ్యర్థి  కవిత వాకిటి ని గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. రామాంజినేయులు కోరారు.బుధవారం పత్తికొండ పట్టణం ఏడవ ఎంపీటీసీ పరిధిలో అయన అభ్యర్థి కవిత తో పాటు ప్రచార కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని చెప్పారు స్థానిక సంస్థలం ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ల అభ్యర్థులు ను, సిపిఐ బలపరచిన అభ్యర్థులు కు ఓటు వేయాలని అయన కోరారు. కూటమి ప్రభుత్వం దౌర్జన్యంగా  గెలవాలని చూస్తున్నదని ఆరోపించారు. మద్యం,డబ్బులు ఎదజల్లి గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.ఈ కార్యక్రమం లో   ఆరవ ఎంపీటీసీ అభ్యర్థి జి. నెట్టేకాంటయ్య,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబిరసూల్, మండల, పట్టణ కార్యదర్శులు కారుమంచి, రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు బి. సురేంద్ర కుమార్, ఎం. కారన్న, కృష్ణ, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి రంగన్న, Yf నాయకులు సిద్దేశ్వర, ఉపేంద్ర,సిపిఐ నాయకులు సుంకన్న, భాష, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *