ఆర్యూ నాల్లవ స్నాతకోత్సవ నిర్వహణకు అందరూ సమన్వయంతో పనిచేయాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నవంబరు 12వ తేదీన నిర్వహించనున్న రాయలసీమ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకోత్సవ (కాన్వకేషన్) నిర్వహణకు అందరూ సమన్వయంతో పనిచేయాలని వి.సి. ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. స్నాతకోత్సవ ఏర్పాట్లగురించి ఈరోజు వి.సి. కాన్ఫరెన్సుహాలులో వివిధ కమిటీల కన్వీనర్లు, సభ్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. స్నాతకోత్సవ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా తగిన ప్రణాళికలను రూపొందించుకోవలసినదిగా అధికారులకు సూచించారు. వివిధ పి.జి కోర్సుల్లో ప్రతిభచూపిన విద్యార్థులకు బంగారు పతకాలు, పిహెచ్డి .డిగ్రీల ప్రదానానికి తగిన కార్యాచరణను సిద్ధంచేయవలసినదిగా సూచించారు. సీనియర్ అధ్యాపకుల మార్గదర్శనంలో వేదిక ఏర్పాట్లతో పాటు అతిథుల స్వాగత సత్కారాలకు ఏర్పాట్లు చేయవలసినదిగా ఆయన ఆదేశించారు. రాజ్‌భవన్ అధికారులతోపాటు జిల్లాయంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ స్నాతకోత్సవ ఏర్పాట్లను త్వరితగితిన పూర్తిచేయాల్సిందిగా వర్సిటీ అధికారులకు ఆచార్య బసవరావు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్. నరసింహులు, సిడిసి మరియు పరీక్షల విభాగ డీన్ ఆచార్య పి.వి. సుందరానంద్, రీసర్చ్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య ఆర్. భరత్‌కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లుతోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

