NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు ఈ పట్టాదారు పాస్ బుక్ లు ఇవ్వాలి

1 min read

తహసీల్దార్ కు రైతుల మొర

కర్నూలు , న్యూస్​ నేడు :  నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో  అనుభవంలో ఉన్న భూముల ను ఆన్లైన్ లో తమ పేర్లను నమోదు చేసి రైతులకు ఈ పట్టాదారు పాస్ బుక్ లు ఇవ్వాలని రైతులు తహసీల్దార్ కె. రమాదేవి కి మొర పెట్టుకున్నారు. శుక్రవారం గనేకంటి సున్నం భీమయ్య కుమారుడు గనేకంటి సున్నం రఘు ఆధ్వర్యంలో సుమారు 10 మంది రైతులు తమ సమస్యను పరిష్కరించాలని ఆమెకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు కామాటి రాఘన్న, రైతులు మాట్లాడుతూ గత 3 వందల ఏళ్లుగా తమ పెద్దల కాలం నుంచి సంభందిత భూముల్లో ఇప్పటికీ సాగులో ఉన్నామని తెలిపారు. సదరు భూములను ఇనాం భూములుగా వర్గీకరించి పైమాసి, సర్వే నెంబర్లను ఇన్నాం రద్దు మరియు రైతువారీగా మార్చే 1956 చట్టం ప్రకారం 1975 లో మా పెద్దలకు అప్పటి ఆదోని ఇనాం డిప్యూటీ తహసీల్దార్ వి. నోటీసులు కొందరికే జారీ చేశారని పేర్కొన్నారు. అయితే మా పెద్దలు నిరక్షరాశ్యులు కావడం వల్ల హాజరు కాలేదని తెలిపారు. 1970 లో రైతులకు ఎలాంటి సమాచారం కానీ నోటీసులు కానీ ఇవ్వకుండా భూములను రీ సర్వే చేశారని ఫైర్ లాండ్ రిజిస్టర్ ను తయారు చేశారని, ఎఫ్ ఎల్ ఆర్ లో తమకు చెందిన సర్వే నెంబర్లు నమోదు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ లు అయినా కూడా పట్టాదారు పాస్ బుక్ లు పొందలేక పోతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా వేదిక ఏర్పాటు చేసి విచారణ జరిపి తమకు చెందిన భూములను ఆన్లైన్ లో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వీరయ్య శెట్టి, వై. నరసింహులు, కామాటి గోవిందు, వనికె గురురాజ, హండే అనుమంతు, బంగి శ్రీనివాసులు, పిల్లి భీమేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author