NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – ఎమ్మెల్యే

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈసందర్భంగా శుక్రవారం ప్యాపిలి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతులకు మూడో విడతగా రూ.6,000ల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే  మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా డోన్ నియోజకవర్గ రైతులకు మొత్తం రూ.20.17 కోట్లు లబ్ధి చేకూరుతున్నట్లు వివరించారు.డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 35,011 మంది రైతులకు రూ.14.01 కోట్లు, అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా 30,848 మంది రైతులకు రూ.6.16 కోట్లు అందుతున్నాయని తెలిపారు. రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని  ఎమ్మెల్యే  పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏటా రూ.20,000లు అందించాలనే లక్ష్యంతో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది అని ఎమ్మెల్యే  తెలిపారు. ఈ ఏడాది చివరి విడతగా రైతుల ఖాతాల్లో ఈ రోజు రూ.6,000 చొప్పున జమ చేయడం జరుగుతుందని వెల్లడించారు.2025–26 ఆర్థిక సంవత్సరానికి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మొత్తం రూ.8985.41 కోట్లు విడుదల చేస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.6560.18 కోట్లు,కేంద్ర ప్రభుత్వం వాటా రూ.2425.23 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే  స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వరావు యాదవ్, డోన్   మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, మాజీ ఎంపీపీ టి శ్రీనివాసులు, ఎంపిడిఓ శ్రీనివాసరావు, ఎంఆర్ఓ భారతి, టిడిపి నాయకులు వలసల రామకృష్ణ, మండల కన్వీనర్ మెట్టుపల్లి సుదర్శన్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు, పెద్ద పుజార్ల ప్రసాద్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర, ప్రిన్సిపాల్ మధు,ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా ఫీర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి,గోల్ల రామ్మోహన్ యాదవ్, బిజెపి నాయకులు దామోదర్ నాయుడు,కెసి.మద్దిలేట్టి,కడితం ప్రతాప్ రెడ్డి, రాజా రవి,క్రిష్టయ్య, బ్యాంక్ శ్రీను,ఎడి సునిత, మండల వ్యవసాయ అధికారి రాజేష్, బేతంచేర్ల ఎఓ విజయ్ కుమార్ రెడ్డి, డోన్ ఎఓ శ్రీనివాస రెడ్డి,ఎఇఓ,విఎఎలు,విఎచ్ఎ, ఎంపీ ఇఓస్ మరియు రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author