ముఖ్యమంత్రి జిల్లాల్లో ఇచ్చిన హామీలపై చర్యలు తీసుకోండి
1 min read

థర్డ్ ఫేస్ రీ సర్వే త్వరగా పూర్తి చేయాలి
సీసీఎల్ఏ జయలక్ష్మి
కర్నూలు , న్యూస్ నేడు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలలో ఇల్లు లేని వారికి ఇంటి సౌకర్యం కల్పించడంపై ఇచ్చిన హామీల పై చర్యలు మరియు 3వ విడత రీ సర్వే ను త్వరగా పూర్తిచేసే చర్యలు తీసుకోవాల్సిందిగా సీసీఎల్ఏ జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఉదయం విజయవాడ నుండి సీసీఎల్ఏ జయలక్ష్మి అన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన వల ప్రకారం ఇల్లులేని వారికి ఇంటి సౌకర్యం కల్పించే చర్యలు వెంటనే తీసుకోవాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారువిజయవాడ నుండి అడిషనల్ సీసీఎల్ఏ వెంకట మురళి కూడా వీడియోకాన్ఫరన్స్ లో పాల్గొన్నారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ , డిఆర్ఓ వెంకటనారాయణమ్మ , హౌసింగ్ పీడీ చిరంజీవి , అగ్రికల్చర్ జెడి వరలక్ష్మి ,ఆర్డిఓ సందీప్ కుమార్ , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు నాగ ప్రసూన, సునీత బాయి, ఏడి సర్వే ముని కన్నన్ , తాహ సిల్దార్ శ్రీనాథ్ , సూపరిండెంట్ ప్రకాష్ బాబు మొదలగు వారు పాల్గొన్నారు.

