NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం

1 min read

కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కామెంట్స్….

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు కార్పోరేటర్ కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ఉన్న కర్నూలు నగరంలో ఇలాంటి సంస్కృతి లేదు.కర్నూలు నగరంలో ప్రేమ ఆప్యాయతలకు నిలయం, ఫ్యాక్షన్ నడిపిస్తున్న గ్రామాల నుండి కర్నూలు నగరానికి వచ్చారు.ఇలాంటి దాడుల వల్ల నాయకులకు చెడ్డ పేరు వస్తుంది. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని కొరుతున్నాం.స్మార్ట్ మీటర్ల రద్దు చేయాలని నారా లోకేష్ చెప్పారు కానీ అది అమలు కావడం లేదు.కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కర్నూలు నగరంలో అభివృద్ధి మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి.కర్నూలు మంచి వాతావరణం కోసం తెలుగు దేశం పార్టీ నేతలు ఆలోచించాలి.ఇలాంటి దాడుల నిలిపి వేసి అభివృద్ధి చేయాలి, దాడి చేసింది తెలుగు దేశం పార్టీ నేతలే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు.నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కర్నూలు లో ఓటు వేశారు. ఇలాంటి దాడుల వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలవ లేదు.వీటిపై ప్రజలు గమనిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగ భృతి కల్పించాలి.తెలుగు దేశం పార్టీ సంస్కృతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. ఇలాంటి దాడులు జరగలేదు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఇంటి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేశాము.13 నెలల్లో ప్రజలకు ఏమి చేశారో తెలుగు దేశం పార్టీ నేతలను ప్రశ్నిస్తున్నాం.దాడులను నియంత్రణ చేయాలి, కర్నూలు లో పెద్ద మనుషులను ప్రజలు ఓడించారు.ఇప్పటికైనా గమనించాలని కోరుతున్నాం, కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి జరిగింది.మంత్రి స్థాయి లో కర్నూలు ను అభివృద్ధి చేయాలి కానీ ఇలాంటి దాడులు మానుకోవాలి.దాడుల పేరుతో కుటుంబాలను కోల్పోతారు.

About Author