NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి  తల్లిని అవమానించారు

1 min read

ముఖ్యమంత్రి  తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా?

ఒక తల్లిని అవమానిస్తూ మాట్లాడితే రెండు చిన్న మాటలు ఎలా అవుతాయి?

శాసనమండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫైర్

శాంతిభద్రతలపై వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి లోకేష్

అమరావతి, న్యూస్​ నేడు: మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ మండలి వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయేల్ ఆరోపణలను మంత్రి లోకేష్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి  తల్లిని అవమానించారు. అవునా, కాదా సమాధానం చెప్పాలి. అంబటి రాంబాబు వినియోగించిన పదాలను ఒక్కసారి గమనించాలి. ముఖ్యమంత్రి  తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా? మహిళలను మనం గౌరవించాలి. ఆ బాధ్యత మనందరిపై ఉంది. హౌస్ లోపల, బయట మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మా సొంత కార్యకర్త వైఎస్ భారతీరెడ్డి గురించి మాట్లాడితే.. తక్షణమే చర్యలు తీసుకున్నాం. జైలుకు పంపించాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రెండు చిన్న మాటలు మాట్లాడారని చెబుతున్నారు. ఒక తల్లిని అవమానిస్తే చిన్న మాటలు ఎలా అవుతాయి? అలాంటి వ్యక్తిని సభ్యులు సమర్థిస్తే ఎలా? అధికార, ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా మహిళలను కించపరిచే పదాలు వాడకూడదు. అలాంటివి పోత్సహించవద్దని కోరుతున్నా. మేం ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదు.

About Author