NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికవర్ హాస్పిటల్స్ వారి ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా డిన్నె దేవరపాడు గ్రామంలో మెడికవర్ హాస్పిటల్స్ వారు ఏపీఈఆర్‌సీలో ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరానికి ఏపీఈఆర్‌సీ చైర్మన్  పీవీఆర్ రెడ్డి , కమిషన్ సెక్రటరీ కృష్ణ , అసిస్టెంట్ డైరెక్టర్ దీపక్ , జూనియర్ అసిస్టెంట్ సుదర్శన్  పాల్గొన్నారు.ఈ వైద్య శిబిరంలో మెడికవర్ హాస్పిటల్స్ తరఫున డా. సువర్ణ లక్ష్మి (పల్మనాలజిస్ట్),  డా. శశికిరణ్ (ఈఎన్‌టీ స్పెషలిస్ట్) పాల్గొని ఏపీఈఆర్‌సీ ఉద్యోగులను పరిశీలించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.శిబిరంలో పాల్గొన్న ప్రజలకు రక్తపోటు (బీపీ), షుగర్ పరీక్షలు, ఈసీజీ, పీఎఫ్‌టీ (లంగ్ ఫంక్షన్ టెస్ట్), ఈఎన్‌టీ పరీక్షలు నిర్వహించగా, వైద్యుల సూచన మేరకు అవసరమైన వారికి 2డీ ఈకో పరీక్షలు కూడా చేశారు. ముందస్తు ఆరోగ్య పరీక్షల ద్వారా వ్యాధులను తొందరగా గుర్తించి చికిత్స చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు సూచించారు.మెడికవర్ హాస్పిటల్స్ క్లస్టర్ హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహించడమే మెడికవర్ లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు.

About Author