‘న్యాక్’ ర్యాంకుల్లో ఆర్యూ మెరుగైన స్థానాన్ని సాధించడానికి కృషిచేయాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: NAAC ర్యాంకుల్లో రాయలసీమ యూనివర్సటీ మరింత మెరుగైన స్థానాన్ని సాధించడానికి అందరూ కలిసికట్టుగా కృషిచేయాల్సిన అవసరముందని యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. IQAC విభాగం ఆధ్వర్యంలో NAAC ర్యాంకింగు విధానం గురించి వి.సి కాన్ఫరెన్సు హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన వర్సిటీ అధ్యాపకులతో సమావేశమయ్యారు. బోధనతోపాటు, పరిశోధన, కో కరిక్యులర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, NSS మొదలైన విభాగాల్లో యూనివర్సిటీలో చేపడుతున్న కార్యక్రమాలను తగినవిధంగా డాక్యుమెంటేషన్ చేసి ఆధారాలతోసహా సమర్పిస్తే NAACలో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తద్వారా వర్సిటీ పురోభివృద్ధి చెందుతుందన్నారు. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలను గురించి తగిన సూచనలు సలహాలు అందించాల్సిందిగా ప్రొఫెసర్ పాల్ క్లి, ప్రొఫెసర్ రవిచంద్ కంచర్లకు వి.సి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ యూనివర్సిటీలో అందుబాటులోఉన్న వసతులను, బోధన, పరిశోధనలను సమన్వయంచేసుకుంటూ ముందుకుపోతే మంచి ర్యాంక్ సాధించడం కష్టమేమీ కాదని ప్రొఫెసర్ పాల్ క్లి అభిప్రాయపడ్డారు. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలపై వర్సిటీ అధ్యాపకులతో ఆయన చర్చించారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి సాధికారికంగా సమర్పిస్తే రాయలసీమ యూనివర్సిటీ త్వరలోనే NAACలో మంచి స్థానాన్ని సాధిస్తుందని ప్రొఫెసర్ రవిచంద్ కంచర్ల అభిప్రాయపడ్డారు. ఈ దిశగా చేపడుతున్న చర్యలను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ కుమార్ నాయుడు వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, IQAC కోఆర్డినేటర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, డీన్ ఆఫ్ అఫైర్స్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డి, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్. నరసింహులు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, లైబ్రేరియన్ ఎస్. నాగభూషణంతోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

