శ్రీశైలానికి కాలినడకన వచ్చే భక్తులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు
1 min read
కోడుమూరు, న్యూస్ నేడు: కోడుమూరు పట్టణంలోని పరప్ప మిల్ లోని ఉచిత వైద్య శిబిరాన్ని సంచార చికిత్స కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్. రఘు తనిఖీ చేశారు,అనంతరం మాట్లాడుతూ శ్రీశైలానికి కాలినడకన వచ్చే భక్తుల కొరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఉచిత వైద్య శిబిరములు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కర్నూలు వారు చేపట్టడం జరిగినది అని తెలిపినారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో జరిగే ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహారాష్ట్ర,కర్నాటక,తెలంగాణ తదితర ప్రాంత నుంచి భక్తులు పాదయాత్ర చేస్తూ శ్రీశైలం చేరుకుంటారని, వీరందరిని అతిథులుగా భావించి వివిధ ప్రాంతాల్లో ఆన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని,అలాంటి వారందరూ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ తరపున భక్తులు,దాతలు ఆరోగ్య సలహాలు పాటించాలని తెలిపారు.భక్తులకు ఆహారంతో పాటు పరిశుభ్రమైన తాగు నీరు అందించడం మంచిదన్నారు,నడిచే భక్తులు తలపై టోపీ కానీ,టవల్ కానీ వేసుకోవాలన్నారు,భక్తులకు ప్రథమ చికిత్స నిమిత్తం ఆయా ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయడము జరిగిందన్నారు. దాతలకు ఈ క్రింద కనబరచిన ఆరోగ్య సలహాలు పాటించవలెనని కోరుతున్నాము. ప్రస్తుతము ఇప్పుడు ఎండ కాలము కావున భక్తులకు ఆహారముతో పాటు ఎక్కువగా పరిశుభ్రమైన నీటిని అందించడము మంచిది.ఈ క్రింద కనబరచిన గ్రామములో ప్రథమ చికిత్స కేంద్రము ఏర్పాటు చేయడము జరిగిందని, కావలసిన సేవలు ఆరోగ్య కార్యకర్తల ద్వార పొందవచ్చును .1 రేమట 2..సి. బెళగల్ 3. పోలకల్ 4. గూడూరు 5 కోడుమూరు.6. పెంచికలపాడు 7. పెద్దపాడు 8.కల్లూరు 9.గార్గేయపురం ఈ కార్యక్రమంలో , అన్నదాన శిబిరం నిర్వాహకులు శంకర్ బాబు , ఆరోగ్య విస్తరణ అధికారి కృష్ణమోహన్, ఉప ఆరోగ్యవిద్యాధికారి శ్రీనివాస యాదవ్ గారు ఆరోగ్య పర్యవేక్షకులు కమల్ , వైద్య సిబ్బంది ఉమా బాయి, ఆరోగ్య కార్యకర్త సుజాత, ఆశ కార్యకర్తలు పద్మావతి, సరోజ మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

